calender_icon.png 11 May, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫౌజీల కథలకు సెల్యూట్

11-05-2025 12:14:34 AM

సినిమా అంటే వినోదం పంచడమే కాదు..  చరిత్రను తెలియజేస్తూ దేశభక్తినిరగిలించేది కూడా! తెల్లదొరల బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించిన స్వాతంత్య్ర సమరయోధుల వీరగాథలైతేనేమి.. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన సైనికుల నిజ జీవిత ఘటనల సమాహారమైతేనేమి.. అన్నీ హృదయాన్ని మెలిపెట్టే కథలే!  అలా ప్రేక్షక లోకం జేజేలు పలికిన కొన్ని ఫౌజీల కథల సమాహారం...

ఆపరేషన్ సిందూర్

పహల్గాం ఘటనకు ప్రతీకరంగా పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ దాడికి దేశమంత ముక్తకంఠంతో మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సిని మా చేసేందుకు పలు చిత్ర నిర్మాణ సంస్థలు పోటీపడ్డ విదితమే.

ఈ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌లో పలు నిర్మా ణ సంస్థలు దరఖాస్తు కూడా చేసుకున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా ఓ సంస్థ ఈ టైటిల్‌తో సినిమాను రూపొందించనున్నట్టు అధికారికంగా ప్రకటించేసింది. ఈ మేరకు ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది.

యూనిఫాం ధరించి.. రైఫిల్ పట్టుకొని నుదుటన సిందూరం దిద్దుకుంటున్న మహిళను ఈ పోస్టర్‌లో చూపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఫైటర్ జెట్‌లు, మండుతున్న యుద్ధభూమినీ ఇందులో కనిపిస్తోంది. నిక్కీ విక్కీ భగ్నా ఫిల్మ్స్, ది కంటెంట్ ఇంజనీర్ పతాకాలు సంయుక్తంగా రూపొందించనున్న ఈ చిత్రానికి ఉత్తమ్ మహేశ్వరీ, నితిన్ దర్శకత్వం వహిస్తారని మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం భారత్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలను, పహ ల్గాం సంఘటనను ఈ సినిమాలో చూపనున్నట్టు స్పష్టమవు తోంది. ఈ సినిమాకు సంబంధించి తారాగణం వివరాలను ఇప్పటికైతే మేకర్స్ వెల్లడించలేదు. 

సినిమా ప్రకటనపై క్షమాపణలు 

‘ఆపరేషన్ సిందూర్’ సినిమా ప్రకటనపై విమర్శలు వచ్చాయి. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. సమయం సందర్భ మంటూ లేకుండా టైటిల్ రివీల్ చేయడంపై నెటిజన్లు విమర్శించారు. దీంతో డైరెక్టర్ ఉత్తమ్ మహేశ్వరీ క్షమాపణలు చెబుతూ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.

“ఆపరేషన్ సిందూర్’పై సినిమా చేస్తున్నట్టు ప్రకటిం చినందుకు క్షమాపణలు చెప్తున్నా. ఇతరుల మనోభావాలను గాయపర్చడం, రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు. మన సైనికుల ధైర్యసాహసాలను, త్యాగాలను, నాయకత్వ పటి మను ఒక శక్తిమంతమైన కథగా వెండితెరపైకి తీసుకురావాలనుకు న్నా.

దేశం పట్ల నాకున్న గౌర వాన్ని తెలియజేస్తూ దీన్ని రూపొందించాలనుకున్నా. అతేకానీ, డబ్బు కోసమో ఫేమ్ కోసమో కాదు. ఈ సమయం, సున్నితత్వం కొందమందికి అసౌకర్యం కలగించి ఉండొచ్చు. అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నా. ఇది సినిమానే కాదు.. దేశ ప్రజల ఎమోషన్‌” అని రాసుకొచ్చారు.  

యుద్ధ వీరుల కథ అంటే దేశభక్తి, సాహసాలు, కుటుంబాల త్యాగాలే గుర్తుకొ స్తాయి. మాతృభూమి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని ఎంతోమంది సైనికుల త్యాగాలను కొన్ని సినిమాలు వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ఇలాంటి సిని మాలు మరుగున పడిన చరిత్రనూ ఆవిష్కరిస్తున్నాయి. అలాంటి ప్రయత్నంతో భారతీయ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన సినిమాలెన్నో. ఇంకా ముస్తాబవుతున్న చిత్రాలు లేకపోలేదు. 

తెలుగులో తెరకెక్కినవి.. 

కొందరి వల్ల దేశద్రోహిగా ముద్రపడిన స్వాతంత్య్ర సమరయోధుడి కథ ‘సర్దార్ పాపారాయుడు’. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. 1993లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమా ఎవర్ గ్రీన్‌గా నిలిచింది. ఇందులో ఎన్టీఆర్ గెటప్స్, పుణ్యభూమి నాదేశం పాట ఇప్పటికీ దేశభక్తుల గుండెల్లో పదిలంగా ఉన్నాయి.

భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి పోరాడిన మన్యం వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’ కథతో కృష్ణ మెప్పించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్ నటించిన ‘ఖడ్గం’ దేశభక్తి కథాంశంతో వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ముష్కర మూకలపై హృదయం నిండా దేశభక్తిని నింపుకున్న పౌరులు సాగించిన పోరులో భారతీయులదే అంతిమ విజయమని చాటిన చిత్రమిది.

ఈ సినిమా విడుదలైన తర్వాత కృష్ణవంశీకి కొందరు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి చంపేస్తా మంటూ బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. దీంతో ఆయన కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. సమాజంలో పేరు కుపోయిన అవినీతిపై ఓ స్వాతం త్య్ర సమరయోధుడు ఎలా పోరా టం చేశాడన్నదే ‘భారతీయుడు’ కథ.

కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో వచ్చిన ఈ సినిమాలో అడు గడుగునా దేశభక్తి కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రపంచ ప్రఖ్యాత ఆ స్కార్ అవార్డును దక్కించుకున్న ఈ చి త్రం తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో చాటింది.

ఇంకా నా దేశం, బొబ్బి లి పులి (1982), వందేమాతరం, స్టాలిన్, ఠాగూర్, ఘాజీ, కొమరం పులి, సుభాష్ చంద్రబోస్, పరమవీరచక్ర, మేజర్ చంద్రకాంత్, ఆంధ్రకేసరి, జై, నేటి భారతం, సైరా నరసింహారెడ్డి వంటి తెలుగు చిత్రాలు దేశభక్తిని చాటాయి. వీటితోపాటు ప్రభా స్ రాఘవపూడి కాంబోలో వస్తున్న ‘ఫౌజీ’, విజయ్ దేవరకొండ 14వ సినిమాతోపాటు పవన్‌కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’, నిఖిల్ ‘స్వయంభూ’ పీరియాడిక్ స్టోరీలతోనే తెరకె క్కుతున్నాయి. 

1940 నేపథ్యం కథతో రాబోతున్న ‘ఫౌజీ’  

ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా వస్తోంది. దీనికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియన్ పారా మిలిటరీకి చెందిన సైనికుడిగా ప్రభాస్ కనిపిస్తారట.

ఇందులో అనుపమ్‌ఖేర్, మిథున్‌చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1940 కాలాన్ని తలపించేలా భారీ వ్యయంతో ఈ సినిమా కోసం కొన్ని ప్రత్యేకమైన సెట్స్ వేసినట్టు సమాచారం. రజాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియడ్‌లో ఈ మూవీ సాగుతుంది.   

బ్రిటిష్ పాలనా కాలంనాటి ఘటనల ఆధారంగా ‘వీడీ14’

హీరో విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ కాంబో క్రేజీ ప్రాజెక్టును శుక్రవారం మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘వీడీ14’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

బ్రిటిష్ పాలనా కాలం నేపథ్యంగా వచ్చిన చిత్రాల్లో ఇప్పటిదాకా ఎవరూ తెరకెక్కించని కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు. 19వ దశకం నేపథ్యంతో 1854 మధ్య కాలంలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. 

ఇతర భాషల్లో మరికొన్ని.. 

ఇతర భారతీయ భాషల సినిమాలు కూడా స్ఫూర్తిదాయక కథలతో రూపుదిద్దుకున్నాయి. స్కై ఫోర్స్, కేసరి2, గ్రౌండ్ జీరో, మంగళ్ పాండే: ది రైజింగ్, గదర్: ఏక్ ప్రేమ్ కథ, బోర్డర్, స్వదేశ్, లగాన్, లక్ష్య, రంగ్ దే బసంతి, చక్ దే, ఉరి: ది సర్జికల్ స్ట్రుక్, గోల్డ్, రాజీ, ఎయిర్ లిఫ్ట్, ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్, లాహోర్, దేవా, గాంధీ, సేనాని సానే గురూజీ, బాపు నే కహా థా, అమరన్ చెప్పుకోదగ్గవి.

ముఖ్యంగా ఇటీవల ప్రేక్షకాదరణ పొందిన సినిమా ‘స్కైఫోర్స్’. గత జనవరి 24న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల తగ్గట్టుగా రూపొందింది. అక్షయ్‌కుమార్, వీర్ పహారియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 1965లో జరిగిన భారత్ వైమానిక యుద్ధం నేపథ్యంలో సాగుతుంది.