02-05-2025 01:15:13 AM
పటాన్ చెరు, మే 1 :అమీన్ పూర్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. సర్వేనంబర్ 993 ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన మూడు ఇండ్ల నిర్మాణాలను, రెండు బేస్మేంట్లను జేసీబీలతో కూల్చివేసినట్లు తహసీల్దార్ వెంకటస్వామి తెలిపారు. అమీన్ పూర్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నవారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.