calender_icon.png 2 May, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతికి అనూహ్య స్పందన!

02-05-2025 01:17:13 AM

  1. విస్తృతస్థాయిలో ప్రజల్లోకి భూభారతి 
  2. 5నుంచి జిల్లాకు ఒక మండలం చొప్పున 28 మండలాల్లో అమలు
  3. నాలుగు పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పూర్తి
  4. 555 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి 
  5. భూసమస్యలపై 11,630 దరఖాస్తుల స్వీకరణ
  6. 20 జిల్లాల్లో 45 సదస్సులకు హాజరైన మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): తెలంగాణలో భూసమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక మైన భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది.

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఏమాత్రం ఆటంకం కలగ కుండా ఉండేలా పైలట్‌గా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, నారాయణ్‌పేట జిల్లా మద్దూర్, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో పూర్తి స్థాయిలో భూభారతి  అమలవుతోంది.

ఇదే సమయంలో ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతీరోజు ఒక మండ లంలోని రెండు గ్రామాల్లో అవగాహన సదస్సులు జరుగుతున్నాయి.  ఇదిలాఉండగా, మరోవైపు హైదరాబాద్ మినహా మిగిలిన 28 జిల్లాల్లో జిల్లాకు ఒక మండలాన్నిపైలట్‌గా తీసుకొని 28 మండలాల్లో పూర్తిస్థాయిలో భూభారతి చట్టాన్ని అమలుచేయా లని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పుడు జరుగుతున్న ఈ రెండు సదస్సుల్లో కలెక్టర్లు స్వ యంగా పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశంతో.. మండల స్థాయిలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో రెండు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ భూభారతి చట్టం రైతులకు అర్థమయ్యే విధంగా చట్టాన్ని అమలుచేసే అధికారులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించింది.

భూభారతి చట్టంలో కీలకపాత్ర వహించిన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక సవాల్‌గా తీసుకొని విస్తృత స్థాయి లో జిల్లాల్లో పర్యటించి రోజుకు రెండు, మూడు అవగాహన సదస్సుల్లో స్వయంగా  పాల్గొన్నారు. ఏప్రిల్ 17వ తేదీనుంచి 30వ తేదీవరకు దాదాపు 20 జిల్లాల్లో సుమారు 45 సదస్సుల్లో పాల్గొన్నారు.

ఇక నాలుగు పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో ఏప్రిల్ 17వ తేదీ నుంచి 30వ తేదీవరకు రెవెన్యూ సదస్సులను పూర్తిచేశారు. ఈ సదస్సుల్లో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు ఆయా మండలాల్లో భూసమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. స్వీకరిం చిన ప్రతీ దరఖాస్తుకు రశీదు అందజేశారు.

ఒక ప్రత్యేక ఫార్మాట్‌లో తయారుచేసిన దరఖాస్తులను రెవెన్యూ సదస్సుకు ముందురోజే ప్రజలకు అందించారు. లింగంపేటలో 3,702, వెంకటాపూర్ లో 3,969, మద్దూర్ లో 1,341, నేలకొండపల్లిలో 2,618 మొ త్తం 11,630 దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా పీపీబీకి సంబంధించి 3,446, సాదాభైనామాలపై 2,796 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులన్నిం టినీ  ఏరోజుకు ఆరోజు కంప్యూటర్‌లోన మోదుచేసి సంబంధిత అధికారులకు పం పించా రు.

మండుటెండలను సైతం లెక్కచేయకుం డా ప్రజలు స్వచ్ఛందంగా ఈ సదస్సుల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ మినహా 605 మండలాలకుగాను 555 మండలాల్లో బుధవారం నాటికి సదస్సులు పూర్తయ్యా యి. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి జూన్ 2వ తేదీ నాటికి ఆ నాలుగు మండలాల్లో భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 

భూభారతి విప్లవాత్మక మార్పునకు నాంది: మంత్రి పొంగులేటి

 ‘సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభు త్వం దార్శనికతతో తీసుకొచ్చిన భూభారతి చట్టం విప్లవాత్మక మార్పునకు నాంది పలకబోతోంది. నూటికి నూరుశాతం ప్రజలే కేంద్రబిందువుగా రైతు సంక్షేమమే లక్ష్యంగా ఈ చట్టం ఉంది. ఈచట్టానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.

జిల్లాల్లో పర్యటించిన సందర్భం లో తమ భూసమస్యలు భూభారతి చట్టంతో పరిష్కారమవు తాయనే నమ్మకం, విశ్వాసాన్ని రైతులు వ్యక్తం చేశారు. ధరణితో వారు అనుభవించిన కష్టాలను, బాధలను వ్యక్తం చేశా రు. ధరణితో వారు ఎదుర్కొన్న సమస్యలను చెప్తుంటే వారు పడ్డ కష్టం కండ్లముందే కనిపించింది.

రైతుల భూసమస్యలను వీలైనంత త్వరితగతిన పరిష్కరించడానికి అధికార యంత్రాంగాన్ని సంసిద్ధం చేశాం. ఇకనుంచి రైతులు ఏ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ కార్యాలయంలోనే వాళ్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రజల వద్దకే అధికారులు వచ్చి పైసా ఖర్చు లేకుండా పరిష్కరించే విధానం నిరంతరం కొనసాగుతుంది.

ఈ పైలట్ నాలుగు మండలాల్లో కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలు మినహా అన్ని  సమస్యలను జూన్ 2వ తేదీ నాటికి పరిష్కరిస్తాం. ఆ నాలుగు పైలట్ మండలాల మాదిరిగానే ఈ నెల 5వ తేదీ నుంచి రాష్ర్టంలోని 28 జిల్లాల్లో జిల్లాకు ఒక మండలంలో పూర్తిస్థాయిలో భూభారతిని అమలుచేస్తు న్నాం.

చట్టం తీసుకువస్తే సరిపోదు, ఆ చట్టం పూర్తి స్థాయిలో అమలు జరిగినప్పుడే రైతులకు నిజమైన న్యాయం లభిస్తుంది. ఆ దిశగా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.