06-05-2025 12:50:16 AM
రామ్‌చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన ‘పెద్ది’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొన్నటిదాకా షూటింగ్‌లో పాల్గొన్న రామ్‌చరణ్ ప్రస్తుతం విదేశీ పర్యటనకు వెళ్లారు. టుస్సాడ్‌లో తన మైనపు బొమ్మ ఆవిష్కరణలో పాల్గొననున్నారు.
ఆయన రావడానికి కనీసం మూడు వారాలైనా పట్టనుందట. ఈలోపు ఆయనతో సంబంధంలేని సన్నివేశాలను తెరకెక్కించే యోచనతో ఉన్నారట మేకర్స్. అయితే, ఈ సినిమాలో ఓ ఐటం సాంగ్ ఉంటుందని, ఆ పాటను కాజల్‌తో చేస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ డైరెక్టర్ బుచ్చిబాబు ప్లాన్ వేరే ఉందట. ఓ స్టార్ హీరోయిన్‌తో ఈ ఐటం సాంగ్‌లో స్టెప్పులేయించనున్నారట. ఆ స్టార్ హీరోయిన్ ఎవరనే విషయమై ఆరా తీసినవాళ్లకు ‘కిస్సిక్’ పాప పేరు తెలిసిందట! ‘పుష్ప2’ సినిమాలో శ్రీలీల చేసిన ఐటం సాంగ్ ఎంతగా ఆకట్టుకుందో వేరే చెప్పక్కర్లేదు.
అల్లు అర్జన్‌తో ఈ బ్యూటీ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ రామ్‌చరణ్‌తో చిందులు వేసేందుకు సిద్ధమైందట. ‘రంగస్థలం’లో జిగేల్ రాణి పాటలాగే ఓ ఊరమాస్ సాగ్‌ను ప్లాన్ చేసిన బుచ్చిబాబు.. ఈ పాటకు శ్రీలీల అయితే న్యాయం చేస్తుందని మైత్రీమూవీ మేకర్స్ నిర్మాతలకు చెప్పారట. వాళ్లు ఇంకా శ్రీలీలను సంప్రదించలేదని, కానీ దాదాపు ఆమెనే ఖరారు చేస్తారని అంటున్నారు.