calender_icon.png 6 May, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్యా మద్దతు భారత్‌కే

06-05-2025 12:38:36 AM

  1. పహల్గాం దాడి ఘటనను ఖండించిన రష్యా అధ్యక్షుడు
  2. విక్టరీ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
  3. త్వరలో భారత్‌లో పర్యటించనున్న పుతిన్

న్యూఢిల్లీ, మే 5: ఉగ్రవాదంపై భారత్ జరుపుతు న్న పోరాటంలో తమ పూర్తి మద్ద తు ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన పుతిన్ పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. మే 9న రష్యా విక్టరీ డే వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

రష్యా విక్టరీ డే వేడుకలకు మోదీ హాజరుకావాల్సి ఉన్నా ఉగ్రదాడి తర్వాత రష్యా పర్యటన రద్దయింది. త్వరలోనే రెండు దేశాల వార్షిక సదస్సు భారత్‌లో జరగనుంది. ఈ సదస్సుకు రావాలని మోదీ ఆహ్వానం పలకగా పుతిన్ అంగీకరించినట్టు క్రెమ్లిన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి  ఖ్వాజా అసిఫ్ మాట్లాడుతూ.. రష్యా, చైనా వంటి పశ్చిమ దేశాలు ఈ విపత్కర సమయంలో మోదీ అబద్దాలు చెబుతున్నాడా? నిజాలు చెబుతున్నాడా అని స్వతహాగా దర్యాప్తు చేస్తాయని నమ్ముతున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.