calender_icon.png 2 October, 2025 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

02-10-2025 01:02:12 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), అక్టోబర్ 1: మండల కేంద్రం అర్వపల్లిలోని జెడ్పిహెచ్‌ఎస్ లో 2008-09 బ్యాచ్ పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు బుధవారం అర్వపల్లిలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సంద ర్భంగా వారంతా ఒక్కచోట చేరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని బావోద్వేగానికి గుర య్యారు.

నాటి గురువులు నేర్పిన శిక్షణ, క్రమశిక్షణతో తాము నేడు వివిధ స్థాయిలో ఉన్నామని, ఆనాటి గురువులైన పద్మజా ప్రభాకర్ రెడ్డి, కుర్ర శ్రీనివాస్, సురేంద్ర, దావుల మల్లికా ర్జున్, సంతోషలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శంకర్, జనార్ధన్, ప్రసాద్, నరేష్, గిరి, రాంబాబు, శేఖర్, సురేష్, జ్యోతి, స్వప్న, సత్యవతి, కళ్యాణి, మమత పాల్గొన్నారు.