calender_icon.png 2 October, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సహకరించాలి

02-10-2025 01:01:08 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి అక్టోబర్ 1 (విజయక్రాంతి): స్థానిక. సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ర్ట ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో పాటు, గ్రామ పంచాయతీ ఎన్నికలను  నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, (ఎన్నికల నియమావళి) ని పాటిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహణకు సహకరించాలన్నారు, ఎన్నికల నిబంధనలకు సంబంధించి తీసుకోవలసిన చర్యలు, నామినేషన్ల ప్రక్రియ, స్కూటీని, ఖర్చుల వివరాలు, ఎన్నికలు నిబంధనలు తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకుతెలిపారు.

ముగ్గురు పిల్లల నిబంధనలు అలాగే ఉందన్నారు. నామినేషన్ కు ముందుగానే  ఓటర్ లిస్టులో  పేరు ఉందా లేదా అని చూసుకోవాలన్నారు. ఎన్నికల కోసం  కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, ెర్డింగులు, ఫోటోలను పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు. 

ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, పెయిడ్ న్యూస్ సంబంధించి ప్రత్యేకంగా పర్యవేక్షించి సంబంధిత రాజకీయ పార్టీ/ అభ్యర్థి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక దష్టి సారించి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

అక్టోబర్ 9 న నోటిఫికేషన్ వస్తుందని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫేజ్  ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని అన్నారు.

మొదటి, రెండవ విడతలలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు,జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి ,  రెవిన్యూ డివిజనల్ అధికారి కష్ణారెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్ రెడ్డి  రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.