22-01-2026 01:50:04 AM
దోమలగూడలో కవాడిగూడ, ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
ముషీరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): నగరంలో పరిపాలన వికేంద్రీకరణ తో ప్రజల సౌలభ్యం కోసం రింగోడ్డు లోప ల ఉన్న గ్రామపంచాయితీలు, మునిసిపాలిటీలు కార్పొరేషన్లను ఒకేరకమైన పాలన వ్యవస్థలోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రణాళికా బద్ధంగా హైదరాబాద్ నగర అభివృద్ది కోసం ప్రత్యేక కార్యచరణతో సిఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అన్నారు.
బుధవారం కవాడిగూడ డివిజన్ పరిధిలోని దోమలగూడ లో నూతనంగా రూ.10.50 కోట్ల వ్యయం తో నూతనంగా నిర్మించిన కవాడిగూడ, ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని రాష్ట్ర మం త్రి పొన్నం ప్రభాకర్. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపా ల్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, జోనల్ కమిషనర్ రవికిరణ్, స్థానిక కార్పొరేటర్ జి. రచనశ్రీ, కార్పొరేటర్లు కె. రవిచారి, సుప్రియా నవీన్ గౌడ్ లతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు 300 వార్డులుగా విభజించి దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమం లో టీఆర్‌ఎస్ నాయకుడు ముఠా జయసింహ, కవాడిగూడ, గాంధీనగర్, ముషీరా బాద్, భోలక్ పూర్, రాంనగర్, అడిక్మెట్ డివిజన్‌ల బీఆర్‌ఎస్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, ఎం. రాకేష్ కుమార్, కొండా శ్రీధర్ రెడ్డి, వై. శ్రీనివాసరావు, శంకర్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, మీడియా ఇన్ఛార్జి ముచ్చ కుర్తి ప్రభాకర్, డిప్యూటీ కమిషనర్ లు రామానుజుల రెడ్డి, పుష్పలత,
ఏఎంసిలు భాగ్యలక్ష్మి, ప్రవీణ్ కుమార్, వాణి తదితర జీహెచ్‌ఎంసి సిబ్బందితో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీనాయకులు పాల్గొన్నారు. కాగా ప్రతి బుధవారం కేంద్ర క్యాబినెట్ సమావేశం ఉన్నందున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకాడనే ఉద్దేశ్యంతో కావాలనే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బుధవా రమే ఆభివృద్ధి పనులను ప్రారంబించడం సరైంది కాదని బీజేపీ స్థానిక కార్పొరేటర్ జి. రచనశ్రీ. మహంకాళి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రమేష్ రామ్,
కార్యదర్శి సలంద్రి శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు జి. వెంకటేష్, పరిమల్ కుమార్, నగర నాయకులు ఎంసి మహేందర్ బాబు, డివిజన్ అధ్యక్షుడు సలంద్రి దిలీప్ యాదవ్, కార్యదర్శులు కేశవరాజు, బొల్ల రమేష్, ప్రభాకర్ గంగపుత్ర తదితర బీజేపీ నేతలు ఆరోపిస్తూ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.