calender_icon.png 13 January, 2026 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో క్రీడా సంరంభం..

12-01-2026 12:27:35 AM

 జిల్లా స్థాయి క్రికెట్, కబడ్డీ పోటీలు ప్రారంభం

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి11: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికి తీసి వారిని జిల్లా,రాష్ట్ర,అంతర్రాష్ట్ర,జాతీయ,అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని సూర్యా నాయక్ తండా సర్పంచ్ లూనావత్ కృష్ణ నాయక్,పీఏసీఎస్ మాజీ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డిలు అన్నారు.ఆదివారం మండల పరిధిలోని సూర్య నాయక్ తండ గ్రామంలో సూర్యానాయక్ తండ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్,కబడ్డీ పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ యువతలో దాగివున్న ప్రతిభను వెలికి తీయడమే ఈ పోటీల ఉద్దేశం అన్నారు.

యువత క్రీడల్లో రాణించాలని,గిరిజన గ్రామాల యువతకు ప్రజా ప్రభుత్వం,సీఎం రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు అందించడానికి ముందున్నారని,యువతకు తాము ఎల్లవేళలా ముందుంటామని అన్నారు.అనంతరం గ్రామం లో వీధిలైట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ డేగవత్ లక్ష్మీబాలాజీ నాయక్, మాజీ సర్పంచ్ స్వాతిరవీందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు రాజేష్ నాయక్, వార్డు సభ్యులు నరసింహ నాయక్, బుజ్జీబద్రునాయక్, నాయకులు బానోతు రవి, సైదులు తదితరులు పాల్గొన్నారు.