23-09-2025 12:19:17 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): జగిత్యాల సమీపంలోని చలిగల్ లో 10 ఎకరాలలో స్పోరట్స్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కి ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్ సోమవారం వినతి పత్రం అందజేశారు.
జగిత్యాల పట్టణంలో వివేకానంద మినీ స్టేడి యం మధ్యలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయ టం వల్ల మైదానం చిన్నగా మారిందని,జిల్లా స్థా యి క్రీడల సమయంలో మైదానం సరిపోక ఇ బ్బందిగా ఉందని మంత్రికి వివరించారు.
జగిత్యాల జిల్లా కు ఒక మైదానం ఏర్పాటు ఆవశ్యకం గా ఉందని,జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారి లో చల్గల్ వాలంతరి క్షేత్రం లో స్థలం ఉందని అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్ కూడా మంజూరు అయినందున 10 ఎకరాల్లో స్టేడియం నిర్మించాలని కోరారు.ఇక్కడ స్టేడియం ఏర్పాటుతో జగిత్యాల, రాయికల్, కోరుట్ల, కథలాపూర్, ధర్మపురి ప్రాంతాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని,
జిల్లా స్థాయి క్రీడల సమయంలో జిల్లా కేంద్రానికి దగ్గర గా ఉండడం వల్ల రవాణా సౌకర్యం కూడా ఉందన్నారు.వాలంతరి కి ఛైర్మెన్ అయిన ముఖ్యమంత్రి ని,ఆయన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని గతంలోనే కలిసి స్పోరట్స్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని మంత్రి శ్రీహరి కి తెలిపగా ఆయన సానుకూలంగా స్పందించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తెలిపారు.