23-09-2025 12:20:46 AM
కొత్తపల్లి, సెప్టెంబరు 22 (విజయ క్రాంతి): నగరంలోని పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థులు సామాజిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలుష్యాన్ని నివారించడం, సహజ వనరులను పరిరక్షించడం, నగరంలో వాతావరణ మార్పులను తగ్గించడం ద్వారా ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడటానికి వ్యర్థాల నిర్వహణ యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
లలిత్ మోహన్ సాహు మార్గదర్శకత్వంలో 9వ తరగతి విద్యార్థులు జి. అదితి, ఎస్. సాన్విక, మీహా ముబారక్, వి. అమోగ్ సాయి, ఎస్. జయకృష్ణ వ్యర్థాల నిర్వహణ అవగాహన కార్యక్రమాన్ని నగరంలో రైల్వేస్టేషన్ , బస్ స్టేషన్, ఆసుపత్రి వంటి వివిద ప్రదేశాలో నిర్వహించి సామాజిక అవగాహనను తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ. ప్రసాద్ రావు, విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ రశ్మిత, హనుమంతరావు, ప్రిన్సిపాల్ గోపీకృష్ణ, సమన్వయకర్తలు రవీంద్ర పాత్రో, భవాని, నిఖిత లుపాల్గొన్నారు.