calender_icon.png 23 September, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రైతుల నిరసన

23-09-2025 01:33:39 AM

-బెజ్జూర్ మండల కేంద్రంలో రాస్తారోకో, స్తంభించిన ట్రాఫిక్

-నెల గడిచినా అందకపోవడంపై అన్నదాతలు మండిపాటు

బెజ్జూర్ సెప్టెంబర్ 22( విజయ క్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు. నెల రోజులు గడుస్తున్నా ప్రతినిత్యం ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తమకు మాత్రం యూరియా   అందడం లేదని పలువురు రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

పత్తి, వరికి వేయాల్సిన సమయంలో యూరియా వేయకపోతే పంటలు ఎలా పండుతాయని రైతులు మండిపడ్డారు. కొంతమంది తీసుకున్న వారే తీసుకుంటున్నారే తప్ప అర్హులైన రైతులకు అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున రైతులు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.విషయం పోలీసులకు తెలవడంతో ఎస్‌ఐ సర్తాజ్ పాషా రైతులతో మాట్లాడి మన గ్రోమోర్ సెంటర్ వద్ద రైతులు వరుస క్రమంలో ఉండాలని సూచించారు.