23-09-2025 01:35:02 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): నగరంలో వరద ముం పు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా జీహెఎంసీ నిర్మించిన భూగర్భ సంపు లు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ సత్ఫలితాలనిస్తున్నాయి. సోమవారం సాయంత్రం ఖైరతా బాద్‌లో కురిసిన భారీ వర్షానికి కేసీపీ జంక్షన్‌లో నిలిచిన వరద నీరు కేవలం నిమిషాల వ్యవధిలోనే తొలగిపోవడమే ఇందుకు నిదర్శనం.
దీంతో గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్‌కు ఈసారి త్వరితగతిన విముక్తి కలిగింది. సోమవారం సాయంత్రం ఖైరతాబాద్ ప్రాంతంలో కేవలం గంట వ్యవధిలో 7.5 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. దీంతో కేసీసీ జంక్షన్ కూడలి నీట మునిగి ట్రాఫిక్ స్తంభించింది. గతంలో ఈ స్థాయిలో వర్షం పడితే, ఇక్కడ నీరు నిలిచిపోయి మూడు గంటలకు పైగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
కానీ, జీహెఎంసీ ముందుచూపుతో కేసీపీ జంక్షన్ వద్ద 3 లక్షల లీటర్లు, ఆర్‌టీఏ కార్యాలయం వద్ద 7 లక్షల లీటర్ల సామర్థ్యంతో మొత్తం 10 లక్షల లీటర్లు నిర్మించిన రెండు భూగర్భ సంపుల వల్ల, వరద నీరు కేవలం 20 నిమిషాల్లోనే తొలగిపోయింది.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అక్కడికి చేరుకున్నారు. జీహెఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. కాగా త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న బతుకమ్మ కుంట ఏర్పాట్లను కూడా మేయ ర్ పరిశీలించారు. స్థానిక నాయకులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించి, ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు.