calender_icon.png 23 September, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరామచంద్రుడూ ఉయ్యాలో..

23-09-2025 01:32:19 AM

బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా సాగుతున్నాయి. రెండోరోజు సోమవారం అటుకుల బతుకమ్మను మహిళలు సంబురంగా జరుపుకున్నారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించారు.

అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, తుల ఉమ తదితులు బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు.