20-05-2025 12:06:09 AM
పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి
కామారెడ్డి, మే 19( విజయక్రాంతి), పాకిస్థాన్‌తో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు ఆర్మీ త్రివిధ దళాలకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం నుంచి విజయతరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
త్రివిధ దళాలకు మద్దతుగా తాము అండగా నిలుస్తామని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రతి పౌరుడు గా ఆర్మీ వారికి అండగా నిలుస్తామని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలిపారు. సమయంలో ఆర్మీ జవాన్లకు ఆత్మస్థైర్యాన్ని కల్పించేందుకు వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు స్థిరంగా ర్యాలీ ప్రతి జిల్లా కేంద్రంలో నియోజకవర్గ మండల కేంద్రాల్లో కూడా నిర్వహించి ఆర్మీ జవాన్లకు మద్దతు తెలిపాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బిజెపి నాయకులు మురళీధర్ గౌడ్, పైలా కృష్ణారెడ్డి, రంజిత్ మోహన్ , స్థానిక పౌరులు యువకులు పాల్గొన్నారు.