20-05-2025 12:05:26 AM
దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి
మెదక్, మే 19(విజయక్రాంతి ): మెదక్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ నాలుగు దళిత సంఘాలకు చెందిన నాయకులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించి క్యాన్సల్ చేయడం అన్యాయం అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రత్యేక చొరవ తీసుకొని అంబేద్కర్ భవన నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ స్పందించి త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ నిచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేశం, ఎస్సీ, ఎస్టీ,కమిటీ దళిత సంఘ నాయకులు పాతూరి రాజు తదితరులు పాల్గొన్నారు.