calender_icon.png 26 September, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడారికి కన్నీటి వీడ్కోలు

26-09-2025 12:13:10 AM

- గోపాల్ రావు పల్లెలో విషాదఛాయలు

- నివాళులు అర్పించిన ప్రజాసంఘాల నాయకులు 

- ఎర్రబారిన గోపాలరావు పల్లె

- వర్షాన్ని సైతం లెక్కచేయకుండా హాజరైన విప్లవాభిమానులు 

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణ రెడ్డి మరణంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లెలో విషాద ఛా యలు అలుముకున్నాయి. కడారి సత్యనారాయణ రెడ్డి మృతదేహం గురువారం స్వగ్రా మం చేరింది. పలు పార్టీల, ప్రజాసంఘాలు నాయకులు కడారి స్వగ్రామం లో గురువా రం నివాళులు అర్పించారు. ప్రజా సంఘాల నాయకులు గాదె ఇన్నయ్య, విరసం కార్యదర్శి పాణి, అమరవీరుల బంధుమిత్రుల క మిటీ నాయకురాలు పద్మతో పాటు సిపిఐ, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు సత్యనారాయణ రెడ్డి కి నివాళులు అర్పించి ఆయన ప్రజల కోసం చేసిన త్యాగా న్ని కొనియాడారు.

ప్రజా కళామండలి కళాకారుల విప్లవ పాటలు గోపాల్ రావు పల్లె లో మారుమోగాయి. ఈ సందర్భంగా గాదే ఇన్నయ్య తో పాటు పౌర హక్కుల సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మో డీ ప్రభుత్వం చేసిన హత్యాకాండ అని బూటకపు ఎన్కౌంటర్ లో సత్యనారాయణ రెడ్డిని చిత్రహింసలు చేసి కాల్చి చంపారని ఆరోపించారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వం చేసిన హత్య అన్నారు. అంచలంచెలుగా ప్రజా పో రాటాలలో నాలుగు దశాబ్దాలుగా ప్రజా ఉ ద్యమాలలో పనిచేస్తూ మావోయిస్టు కేంద్ర పార్టీ స్థాయికి ఎదిగారని అన్నారు. ద్రోహుల సమాచారంతో కామ్రేడ్ కడారి సత్యనారాయణరెడ్డి తోపాటు మరో కేంద్ర కమిటీ స భ్యులు రాజు ను చత్తీస్గడ్ నారాయణపూర్ జి ల్లా అబూజ్ మడ్ సరిహద్దుల్లో బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపారని ఆ రోపించారు. విప్లవ అభిమను లు కడసారి కన్నీళ్ళతో జోహార్లు అర్పించారు. గ్రామస్తు లు కడారి కి పూర్వం గ్రామంతో ఉన్న సం బంధాలను గుర్తుచేసుకుంది కంటతడి పెట్టారు. 

గోపాల్ రావు పల్లి గ్రామం ఎర్రజెండాలతో రెపరెపలాడింది. ప్రజా కళా మండలి కళాకారులు విప్లవ గీతాలు ఆలాపించి కడారికి జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో భారత్ బచావో జాతీయ అధ్యక్షు లు, ఇన్నయ్య, విరసం నాయకులు పాణి, అమరవీరుల బంధువిత్రుల కమిటీ నాయకురాలు పద్మ కుమారి భారీ సంఖ్యలో విప్లవ అభిమానులు పాల్గొన్నారు.