19-07-2025 10:52:41 PM
మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): దశాబ్దాల తరబడి వినియోగదార నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా శ్రీజయరామ మోటార్స్ నిలుస్తూ వస్తుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) అన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రముఖ ఆటోమొబైల్ డీలర్ శ్రీ జయరామ మోటార్స్ విజయయాత్రలో మరో మైలురాయిని చేరుకుంది. మారుతి కార్ల డీలర్‌షిప్ లో 20,000వ కార్ డెలివరీకి చేరుకోవడంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, శ్రీ జయరామ మోటార్స్ ఆవిర్భవించినప్పటి నుంచి 20,000వ కార్లను విక్రయించడం కి చేరుకోవడం సంతోషాన్ని కలిగిస్తుంది అన్నారు. 20 వేల వ కారుని వినియోధారి కుటుంబ సభ్యులకు ఎంపీ అందజేశారు. ఈ సంస్థ స్థాపించి దశాబ్దాల తర్వాత కూడా నాణ్యతను కొనసాగిస్తూ, వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం అపూర్వ విజయమన్నారు. నిజమైన నమ్మకాన్ని కలిగించినప్పుడు ఇలాంటి అరుదైన రికార్డులు సాధ్యమవుతాయని తెలిపారు.
నమ్మకం విజయం అంచులకు చేర్చుతుంది : బెక్కరి రాంరెడ్డి
దశబ్దల తరబడి వినియోగదారుని నమ్మకాన్ని వమ్ము చేయకుండా అహర్నిశలు శ్రమిస్తూ ఈరోజుకు చేరుకోవడం చాలా సంతోషకరంగా ఉందని సంస్థ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ బెక్కరి రాంరెడ్డి అన్నారు. ఈ ఘట్టం సాధ్యపడటం వెనుక కస్టమర్ల విశ్వాసం, మా బృందం నిబద్ధత, సేవల పట్ల ఉన్న శ్రద్ధ కారణమన్నారు. కారును అమ్మిన తర్వాత కూడా సేవలలో ఎన్నడూ రాజీపడలేదని, అదే మా విజయానికి బీజమని పేర్కొన్నారు. ఓవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ మరోవైపు పాలమూరు ప్రజలకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉంచుతూ వారి నమ్మకాన్ని నిలబెడుతూ ముందుకు సాగుతున్నామన్నారు. శ్రీరామ జయరామ మోటార్స్ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.
శ్రీ జయరామ మోటార్స్ 2012లో మారుతీ డీలర్ షిప్ ప్రారంభించి, తక్కువ కాలంలోనే వేలాది మంది వినియోగదారుల నమ్మకాన్ని పొందడంలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క వినియోదారుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ జయలక్ష్మి, సీఈఓలు విక్రమ్, నాగేంద్ర , షోరూమ్ జనరల్ మేనేజర్ వేను గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటోమొబైల్ రంగాల ప్రముఖులతోపాటు, సంస్థకు మద్దతుగా నిలిచిన అనేక మంది స్నేహితులు, మిత్రులు, కుటుంబ సభ్యులు వేడుకలో పాల్గొని సందడి చేశారు.