19-07-2025 10:55:16 PM
నూతన ఎస్సైగా సంజీవ్ రెడ్డి బాధ్యతల స్వీకరణ..
చండూరు (విజయక్రాంతి): గట్టుప్పల్ పోలీస్ స్టేషన్(Gattuppal Police Station) ఎస్‌ఐ గుత్తా వెంకట్ రెడ్డి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో సంజీవ్ రెడ్డి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. స్థానికంగా శాంతిభద్రతలు పర్యవేక్షించే బాధ్యతలను ఆయన చేపట్టారు. ప్రజల సహకారంతో నియమాలను కట్టుదిట్టంగా అమలు చేస్తానని ఆయన తెలిపారు. అదేవిధంగా గుత్త వెంకటరెడ్డి ఎస్ఐకీ వీడ్కోలు పలికి ఆయనను శాలువతో సన్మానించి ఆయన ప్రజలకు చేసిన సేవలు మరువలేవని వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్, పి వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ ఎం సుదర్శన్, డబల్ పీసీలు ఆప్రిన్ ఝాన్సీ, హోంగార్డు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు