calender_icon.png 31 December, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహదూర్‌ఖాన్‌పేటలో పెద్దపులి!

31-12-2025 12:52:42 AM

భయాందోళనలో సమీప గ్రామస్థులు

కొత్తపల్లి, డిసెంబర్ 30 (విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్‌పేట గ్రామం వెదురు గట్ట పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం పెద్ద పులి కనిపించిందని గ్రామస్థులు అటవీ అధికారులకు సమా చారం అందించారు.

అధికారులు చేరుకుని కొ న్ని చోట్ల పాద ముద్రలను గుర్తించి శాంపిల్స్ సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఈ ప్రాంతంలో గతంలో పెద్దపులి తిరి గిన ఆనవాళ్లు మాత్రం లేవు. పులి కాకుండా దానిని పోలి ఉండే హైనా అయి ఉండవచ్చునేమోనని అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్న ట్టు సమాచారం. పరిసర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కరీంనగర్ డీఎఫ్‌వోకు బండి సంజయ్ ఫోన్

ఈ విషయమై కేంద్ర మంత్రి బండి సంజ య్ జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణితో ఫోన్‌లో మాట్లాడారు. రైతులు, స్థానికులు భయపడకుండా ఉండేందుకు అవసరమైన చర్యల్ని చేపట్టాలని ఆదేశించారు.  అక్కడి అటవీఅధికారులు గుర్తించిన పాదముద్రలు పులివే నని మంత్రికి చెప్పినట్టు సమాచా రం.

ఉమ్మడి అదిలాబాద్‌లోని అటవీ ప్రాం తం నుంచి ఇక్కడికి వచ్చిందని, మగ పులిగా భావిస్తున్నామని అధికారులు చెప్పినట్టు తెలిసింది. కరీంనగర్ జిల్లాలో అటవీ ప్రాంతం లేకపోవడంతో తిరిగి పెద్దపల్లికు వెళ్లి ఉంటుందనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తు న్నారు.