31-12-2025 12:52:41 AM
కొత్తపల్లి, డిసెంబర్ 30(విజయక్రాంతి): డిసెంబర్ నెల 28వ తేదీ రామగుండంలో నిర్వహించిన అంతరాష్ట్ర స్థాయి కరాటే చాం పియన్ షిప్ 2025 లో కరీంనగర్ పట్టణం మంకమ్మతోటలోని సిద్దార్థ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొని వివిధ అంశాలలో అత్యంత ప్రతిభ కరబరచి బంగారు,వెండి, కాంస్య పతకాలు సాధించారు. కటా విభాగంలో జి.సాకేత్ బంగారు పతకం, కుముటె లో కాంస్యం, సాయి రుత్విక్ కుముటే లో వెండి పతకం, ధీరజ్, విశ్వలు కటాస్ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. అత్యు త్తమ ప్రతిభ కనబర్చి వివిధ పతకాలు సా ధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ దా సరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ దాసరి స్వప్న శ్రీ పాల్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం, కరాటే మాస్టర్ పుల్లూరి శ్రీనివాస్ మరియు ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.