31-12-2025 12:53:48 AM
టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ హుస్సేనీ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాం తి): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎం హుస్సేనీ (ముజీబ్) తన ఉదారతను చాటుకున్నారు. ‘అసద్ అన్వర్ మెమోరియ ల్ ట్రస్ట్‘ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని ఎంఎన్‌జె క్యాన్సర్ ఆస్పత్రిలో రోగులకు, వారి సహాయకులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా హుస్సేనీ మాట్లాడుతూ..
క్యాన్సర్ వంటి మహమ్మారితో పోరాడటం అనేది కేవలం శారీరకమైన యుద్ధం మాత్రమే కాదు, అది మానసికమైన, ఆర్థికపరమైన పోరాటమ న్నారు. కార్య క్రమంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, సహా అధ్యక్షుడు కే ఆర్ రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు ఖాలెద్ అహ్మద్, శంకర్ కార్యవర్గ సభ్యుడు ముఖీమ్ ఖురేషి, ఎంన్‌జె కాన్సర్ హాస్పిటల్ చంద్రశేఖర్, అసదుద్దీన్, ఉస్మాన్ అలీ ఉస్మాని, ఫిరోజ్, వహీద్ తదితరులు పాల్గొన్నారు.