calender_icon.png 17 May, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగంగా ధాన్యం కొనుగోళ్ళు

16-05-2025 11:23:18 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని రైస్ మిల్లులకు వెంట వెంటనే తరలిస్తూ ఎప్పటికప్పుడు రైతులు, ట్రాన్స్పోర్ట్  కాంట్రాక్టర్స్, హమాలీలు సంబంధిత సిబ్బందిని సమన్వయ పరుస్తూ ప్రత్యేక అధికారులు, విధులు నిర్వహిస్తున్నారని జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు పౌరసరఫరాల అధికారులు ప్రేమ్ కుమార్, కృష్ణవేణి తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్, మండలాలలో తహసీల్దారులను ఫోన్ల ద్వారా సూచనలు ఇస్తూ అవసరం ఉన్న ధాన్యం కేంద్రాలకు లారీలను పంపడం జరుగుతోందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి అధిక దిగుబడి వచ్చినందున జిల్లా యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లను చేసినట్లు వారు తెలిపారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్,  అదనపు కలెక్టర్ సూచనలు మేరకు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారని తెలిపారు.