29-12-2025 12:00:00 AM
యంత్రాల సాయంతో నీటిలో నుంచి ఇసుక తీసివేత
భారీ ప్రోక్లైన్లు యంత్రాలు వినియోగిస్తున్న పట్టించుకోని అధికారులు
మామూళ్ల మత్తులో అధికారులు
కలెక్టర్, ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
నిర్మల్, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలో ఇసుక వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ నదులు వాగుల్లో ఉన్న ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నిర్మల్ జిల్లాలో మాత్రం ఇసుక దోపిడి ఆగడం లేదు. రాత్రనక పగలనక భారీ యంత్రాలను వినియోగించి మూడు మీటర్ల నీటిలో నుంచి ఇసుకను బయటకు తీసి ట్రాక్టర్లు టిప్పర్లు ద్వారా నిషేధిత ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచుతున్నారు ఇదంతా బహిరంగ రహస్యమైనప్పటికీ ఇసుక రవాణాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ పోలీస్ ఖనిజ గనుల శాఖ చేతులెత్తేయడంతో కోట్లాది రూపాయల విలువచేసే ఇసుక వ్యాపారులకు వరం కాగా సామాన్యులకు భారంగా మారుతుంది.
నిర్మల్ జిల్లాలోని స్వర్ణ వాగులో ఇసుక దోపిడి మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతున్న అధికారులు ఫిర్యాదు చేసే తప్ప నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలోని స్వర్ణ వాగు గడ్డం వాగు అర్లీ శుద్ధ వాగు కనకాపూర్ మామడ కల్లూరు బిదిరెల్లి తదితర వాగులు నదుల నుండి ప్రతిరోజు కోట్లాది రూపాయల విలువచేసే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఇసుకకు డిమాండ్ ఏర్పడడంతో వ్యాపారులు ఇసుక రీచులపై దృష్టి పెట్టి వీడీసీలతో ఒప్పందాలు చేసుకొని నీటిలో ఉన్న ఇసుకను అక్రమంగా తవ్వకాలు నిర్వహించి పర్యావరణానికి కూడా హాని కలిగిస్తున్నారు
మనుషుల స్థానంలో యంత్రాలతో తవ్వకాలు
నిర్మల్ జిల్లాలో వాగులు నదులు ఓ ర్రెలు ఉన్న ఇసుకను కూలీలతో కాకుండా ఇసుకను తవ్వి బయటకు తెచ్చే ఎలక్ట్రానిక్ యంత్రాలు వినియోగిస్తున్నారు. జిల్లాలోని స్వర్ణ వాగు గడ్డన్నవాగు కల్లూర్ పెంబి కడెం కనుకపూర్ తదితర వాగుల్లో ప్రస్తుతం నీళ్లు ఉండడంతో నీళ్ల కింద ఉండే ఇసుకను బయటకు తీయడానికి కూలీలకు ఇబ్బందిగా మారింది. దీంతో ఇసుక వ్యాపారులు మూడు మీటర్ల లోతులో నుండి ఇసుకను తోడే యంత్రాలను నది ఒడ్డున ఉంచి రూప్ తో సాయంతో ఇసుకను వాగు గడ్డలకు చేర్చి అక్కడే జల్లటి సాయంతో పట్టి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా టిప్పర్ల ద్వారా రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు.
ఇప్పటికే స్వర్ణ వాగులో మాదాపూర్ గంజాల్ సిద్దులకుంట మంజులాపూర్ తల్వేద థాంసా కడ్తాల్ ప్రాంతాల్లో ప్రతిరోజు 100 ట్రాక్టర్ ల ఇసుకను అక్రమంగా తవ్వి సరఫరా చేస్తున్నారు. వీడీసీలకు కొంత మొత్తాన్ని ముట్టజెప్పి నిర్మల్కు చెందిన ఇసుక వ్యాపారులు తవ్వకాలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయల విసుకను కొల్లగొట్టి ప్రభుత్వ ఆదానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ఇసుక సరఫరాకు అనుమతి ఇవ్వగా ఇసుకను దక్కించుకున్న వ్యాపారులు వారికి ఇసుక రవాణా ఇవ్వకుండా వారు చెప్పిన ధరను చెల్లిస్తేనే ఇసుక సరఫరా చేస్తున్నారు.
ప్రస్తుతం ఆయ వాగు ల్లో ఇసుక తవ్వకాల కారణంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి ప్రస్తుత మార్కెట్లో ఇసుక ట్రాక్టర్ ధర 3000 నుంచి 4000 వరకు పలకడంతో దాని ధర మరింత పెంచుకునేందుక సరఫరా చేసిన ఇసుకను కొరత సృష్టించేందుకు రహస్య ప్రదేశాలు పంటచేళ్లలో నిలువ ఉంచుకుంటున్నారు స్వర్ణ వాగు వెంబడి పది చోట్ల ఇసుక డంపు లు ఉన్న వాటి జోలికి అధికారులు వెళ్లడం లేదు గ్రామాల్లో ఇసుక రవాణా చేస్తే సమాచారం ఇవ్వాలని గ్రామ కార్యదర్శులు గ్రామ సిబ్బందికి రెవిన్యూ శాఖ ఆదేశించిన కొందరు ఇసుక వ్యాపారులు వ్యాపారులకు ఇతరులకు ప్రలోభాల గురిచేసి ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు
పట్టించుకోని అధికారులు
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదాయ వనరులైన ఇసుక తవ్వకాలను అక్రమ రవాణా అడుక్కోవలసిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోగా వారికి ప్రోత్సహిస్తున్నానని ఆరోపణలు మీద వస్తున్నాయి. ప్రతి రోజు స్వర్ణభాగ నుండి వందల ట్రాక్టర్లు ఇసుక రోడ్డుపైకి వస్తున్న అధికారులు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసే తప్ప వాటిని అడ్డుకున్న దాఖలాలు లేవు. వాగులో భారీ యంత్రాలు ఇసుక నీటిలో నుంచి తోడై ఆధునిక పనిముట్లు ఉన్న అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ముందస్తుగా ఇసుక వ్యాపారులకు వారే సమాచా రాన్ని చేరదీసి నాము మాత్రం కేసులు నోటీసులతో అపరాధ రుసుము ఒకటి రెండు వాహనాలకు వేసి చేతులు దులుపుకుంటున్నారు రెండు రోజుల తర్వాత మళ్లీ అదే పరిస్థితి నెలకొంది.
ఇసుక నిల్వలు దగ్గరగా ఉన్న గ్రామాల ప్రజలకు సైతం ఇసుకదుర్కే పరిస్థితి లేకపోగా వ్యాపారు నిర్ణయించిన దరికి కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని నిరుపేద కుటుంబాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జోరు అందుకున్న నేపథ్యంలో ఇసుక దొరకకపోవడంతో డిమాండ్ ఏర్పడింది నెల రోజుల క్రితం 3000 ఉన్న ఇసుక ధర ఇప్పుడు 4000 చేరుకుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణా పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేద కుటుంబాలకు ఇసుక రవాణాకు సహకరించాలని కోరుతున్నారు.