calender_icon.png 29 December, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజయ్‌తండాను మండలంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి

29-12-2025 01:33:49 AM

రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం, డిసెంబర్ 2౮ (విజయ క్రాంతి): అభివృద్ధి పనులలో వేగం పెంచి అజయ్ తండాను మండలంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ ని ర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం నేలకొండపల్లి మండలం అజయ్ తండాలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అజయ్ తండా గ్రామం అభివృద్ధిలో మరో కీలక అడుగు పడిందని, 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించుకున్న గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

గ్రామ పంచాయ తీలలో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. నూతనంగా ఎంపికైన సర్పంచ్, ఉప సర్పం చ్, వార్డు సభ్యులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శకమైన పాలన అం దించాలని మంత్రి సూచించారు. కొత్త భవ నం వచ్చింది, ఇకనుండి గ్రామ పాలన కూ డా ప్రజలకు చేరువగా ఉండాలని, అభివృద్ధి పనులలో వేగం పెంచి అజయ్ తండాను మండలంలోనే మేటిగా తీర్చిదిద్దాలని మం త్రి దిశా నిర్దేశం చేశారు.

ప్రజా సంక్షేమమే ఎజెండాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని,  పేద ప్రజలకు రేషన్ ద్వారా సన్న బి య్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు తదితర కార్యక్రమాలను అమ లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కా ర్యక్రమంలో నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సీతారాములు, ఖమ్మం ఆర్డీవో న ర్సింహారావు, పీఆర్ ఇఇ మహేష్ బాబు, అజయ్ తాండ సర్పంచ్ తేజావత్ శివాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.