calender_icon.png 25 July, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

24-07-2025 12:36:36 AM

బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు  బైరి శంకర్ ముదిరాజ్

సిద్దిపేట, జులై 23(విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటాలని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  నంగునూరు మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన కార్యకర్తల సన్నాహక కార్యశాలకు బైరి శంకర్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలో చర్చించడమే ప్రధాన ఎజెండాగా కార్యశాల నిర్వహించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అధిక సంఖ్యలో సీట్లను కైవసం చేసుకునే విధంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాలు, హామీలు అమలు చేయక పోవడంపై ఇంటింటి వ్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

గ్రామ గ్రామాన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ద్వారా తెలంగాణ గ్రామాభివృద్ధి సాకారమైందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాలతోపాటు అభివృద్ధి పనులపై ప్రజలకు అవగహన కల్పించాలన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన తీరును ప్రజలకు అర్థం చేయాలన్నారు.

రాబోయే ఎన్నికలలో గ్రామ స్థాయి నుండి జిల్లా పరిషత్ వరకు బీజేపీ అభ్యర్థులు గెలవాలని, ఆకాంక్షించారు. అనంతరం  సిద్దన్నపేట్ చౌరస్తా లో అటల్ బిహారీ వాజపేయి విగ్రహానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పేరాల తిరుపతిరావు,  బిజెపి సీనియర్ నాయకులు తుంగ కనకయ్య, మహిళా మోర్చ నాయకురాలు జ్యోతి రెడ్డి, వివిధ మోర్చా నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, భూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.