11-05-2025 12:36:06 AM
-ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
కడ్తాల్/చేవెళ్ల మే 10 : భారత్ పాకిస్థాన్ యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులు మురళి నాయక్, సచిన్ యాదవ్ లకు కడ్తాల్ మండల కేంద్రంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్ నాయక్ ఆధ్వర్యంలోశనివారం ఘన నివాళులర్పించారు.
జాతీయ జెండాలతో పార్టీ లకు అతీతంగా భారీ ర్యాలీ నిర్వహించి సైనికులకు తాము ఉన్నామని భరోసా కల్పిం చారు. ఈ సందర్భంగా దశరథ నాయక్ మాట్లాడుతూ పాకిస్థాన్‌పై వీరుచుకోపడ్డారు. దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషి స్తున్న పాకిస్థాన్‌కు భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో సరైన బుద్ధి చెబుతుందని అన్నారు.
పాకిస్థాన్‌లో టెర్రరిస్ట్ లు చనిపోతే పాకిస్థాన్ ప్రభుత్వం వాళ్ల సైన్యం ఉగ్రవాదులకు లాంచనప్రాయంగా అంత్యక్రియలు నిర్వహించడం సిగ్గుచేటని మం డిపడ్డారు. యుద్ధంలో వీరమరణం పొం దిన సైనికుల కంటే టెర్రరిస్టులకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తుందని అన్నారు.
ఇప్పటికైనా పాకిస్థాన్ క్షమాపణ చెప్పి వెనకడుగు వేయకపోతే భారత్ చేతిలో కుక్కచావు చావడం ఖాయం అని అన్నారు. పాకిస్థాన్‌ని మట్టి లో కల్పించడానికి భారతదేశ సైనికులు అవసరం లేదని కేవలం భారతదేశంలో ఉన్న మహిళలే చాలన్నారు. భారత మహిళలు తలుచుకుంటే ప్రపంచ పటంలో పాకిస్థాన్ అనే పేరే ఉండదని తెలిపారు.
భారతదేశం ఎవరి జోలికీ వెళ్ళదని తన జోలికి ఎవరు వచ్చిన వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలిపారు. యుద్ధంలో వీరమరణం పొందిన మురళి నాయక్, సచిన్ యాదవుల మరణం వృథా కానివ్వమనీ దానికి ప్రతి కారం కచ్చితంగా భారత సైన్యం తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచులు తులసి రామ్ నాయక్, లోకేష్ నాయక్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రాఘవేందర్, రాందాస్ నాయక్, పాండు నాయక్, మన్యా నాయక్, రెడ్డి నాయక్, రవీందర్ రెడ్డి, రామచంద్రయ్య భగీరథ జైపాల్ నాయక్, కళ్యాణ్ నాయక్, రమేష్ నాయక్, సరియా నాయక్, శీను నాయక్, శివరాం, శ్రీకాంత్, శ్రీను, అంజి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
వీర జవాన్ మురళీ నాయక్‌కు నివాళి
భారత్, -పాకిస్థాన్ యుద్ధంలో వీర మరణం పొందిన ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీలోని కల్లి తండాకు చెందిన మురళీ నాయక్ (23)కు బీజేపీ నేతలు నివాళి అర్పించారు. శనివారం చేవెళ్లలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మండలాధ్యక్షుడు అత్తెల్లి అనంత రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. అగ్నివీర్గా భారత సైన్యంలో చేరిన మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాటం చేశారని కొనియా డారు. ఎల్ వోసీ వద్ద పాక్ కాల్పుల్లో గాయపడి వీర మరణం పొందాడని, ఆయనను యువత స్ఫూ ర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.