11-05-2025 12:59:05 AM
హైదరాబాద్, మే 10(విజయక్రాంతి): లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్(తాలిమ్) జాయింట్ డైరెక్టర్ అండ్ వైస్ ప్రిన్సిపల్ జీవీ మహేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ (గణిత శాస్త్రం ఒక అంశంగా కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత, ఐటీఐ డ్రాఫ్ట్‌మెన్ (సివిల్), డిప్లొమా(సివిల్), బీటెక్ (సివిల్) లేదా ఇతర సమానమైన అర్హతలు కలిగిన అభ్యర్థులకు అర్హత ఉంటుందన్నారు.
దరఖాస్తు ఫారాన్ని మే 5 నుంచి మే 17 వరకు మీసేవా కేంద్రాల ద్వారా మాత్రమే రూ.100 చెల్లించి పొందవచ్చని, దరఖాస్తులను మే 17 వరకు మీసేవా కేంద్రా ల్లో సమర్పించాలని తెలిపారు. శిక్ష ణా ఫీజు ఓసీలకు రూ.10 వేలు, బీసీలకు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,500 ఉంటుందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 9849081489, 7032634404, 9441947339 నెంబర్లలో సంప్రదించవచ్చిని మహేశ్వరరావు పేర్కొన్నారు.