11-05-2025 12:34:20 AM
-అపార్ట్మెంట్ వాసులకు హైడ్రా నోటీసులు ఇవ్వడంపై ఈటల ఫైర్
కుత్బుల్లాపూర్, మే 10(విజయక్రాంతి): తెలంగాణలో తుగ్లక్ ప్రభుత్వం నడుస్తుందని, ముఖ్యమంత్రి శాడిస్ట్‌గా నడచుకుం టూ ప్రజలను వేదిస్తూ పరమానందం పొం దుతున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేం దర్ అన్నారు.
బాచుపల్లి పూజిత ఎంక్లేవ్ లో గల అపార్ట్‌మెంట్ వాసులకు హైడ్రా, ఎమ్మార్వో పేర్లతో నోటీసులు ఇస్తూ కూలగొడతామని భయాందోళనకు గురిచేయడం సరైంది కాదని అన్నారు.ఎన్నో సవంత్సరాల క్రితమే ఇక్కడ అన్ని ప్రభుత్వ శాఖల అనుమతులతో అపార్ట్మెంట్ లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారని ఎంపీ తెలిపారు.
బాచుపల్లి తహసీల్దార్ నోటీసులు ఇవ్వడంతో స్థానికులు తమ ఇండ్లు కూల్చుతారని ఆవేదన చెందుతూ ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికీ తీసుకువెళ్లారు. దీంతో శనివారం పూజిత ఎక్లేవ్ కాలనీ వాసులతో సమావేశమై ప్రజలకు ఎంపీ భరోసా ఇచ్చారు.
తహసీల్దార్ నోటీసులపై మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ను వివరణ కోరగా బాచుపల్లి తహసీ ల్దార్ ఇచ్చిన నోటీసుల విషయం తనకు తెలియదని తెలిపినట్లు ఈటల తెలిపారు. జిల్లా కలెక్టర్ నోటిస్ లో లేకుండానే మండల తహసీల్దార్ ప్రజలకు నోటీసులు పేరుతో భయ పెట్టడం ఎంతవరకు సమంజసం అని వాపోయారు.
హైడ్రా పేరు చెప్పి పేద, మధ్య తరగ తి ప్రజల బ్రతుకులను రోడ్డుపై వేస్తున్నారని అన్నారు. పూజిత ఎంక్లేవ్ కాలనీ ప్రజలకు తాను అండగా ఉంటానని ఎంపీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాదవి, జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధా న కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎన్. ప్రసాద్ రాజు, ప్రగతి నగర్ అధ్యక్షుడు నరేంద్ర చౌదరి, నిజాంపేట్ అధ్యక్షుడు భిక్షపతి యాదవ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ వెంకటసుబ్బారావు, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.