10-02-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఫిబ్రవరి 8: రాష్ట్రంలో అసంఘటిత కార్మికులుగా ఉన్న లక్షలాది మంది డ్రైవర్‌లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ సెక్యూర్ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరగోని రాజుగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో తెలంగాణ సెక్యూర్ డ్రైవర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు.
అధ్యక్షుడిగా కొంతం మహేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడుగా బీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా పొడుగు శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శులుగా జీ అనిల్, డీ పవన్, కోశాధికారిగా జే కుమార్, సలహాదారులుగా వంగ కృష్ణకర్‌గౌడ్, కార్యవర్గ సభ్యులుగా నరసింహ, పీ మహేందర్, సీహెచ్ రమేష్, ఎన్‌ఎం మహేష్, వై. వీరన్న ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా బైరగోని రాజు మాట్లాడుతూ.. డ్రైవర్ లైసెన్స్‌పై ఉన్న ప్రమాద బీమా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. సాధారణ మరణానికి కూడా వర్తింపజేయాలని కోరారు. కుల, మత బేదం లేకుండా అర్హులైన ప్రతి డ్రైవర్‌కు సబ్సీడీ వాహనాలు ప్రభుత్వం అందించాలని అన్నారు.