10-02-2025 12:00:00 AM
టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): పేద ప్రజల కోసం లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తల్లిదండ్రులైన జమ యమ్మ- జగ్గారెడ్డి పేరు మీద సంగారెడ్డి లయన్స్ క్లబ్‌కు అంబులెన్స్‌ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి బహుకరించారు.
పేద ప్రజలకు లయన్స్ క్లబ్ చేస్తున్న సేవల ను మరువలేమన్నారు. తమ వంతు సహా యంగా అంబులెన్స్ ఇవ్వడం జరిగింద న్నా రు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ రాములు గౌడ్, కరుణాకర్ గౌడ్, రీజినల్ చైర్మన్, వెంకటేశం, జోనల్ ఛైర్మెన్ జార్జ్, ప్రెసిడెంట్ నాయికోటి రామప్ప, సెక్రటరీ కృష్ణ, ట్రెసర ర్, జిల్లా చైర్మన్ విజేందర్ రెడ్డి, హన్మంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.