23-08-2025 12:35:00 AM
దొంగగా అవతారం ఎత్తిన బీటెక్ స్టూడెంట్
మేడ్చల్, ఆగస్టు 22(విజయ క్రాంతి): బెట్టింగులో నష్టపోయిన డబ్బులను దొంగతనం చేసి కవర్ చేయాలని భావించిన ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. సుధీర్ అనే బీటెక్ విద్యార్థి ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడుతూ 20 లక్షల వరకు నష్టపోయాడు. ఈ మొత్తాన్ని దొంగతనం చేసి రికవరీ చేయాలని భావించాడు.
రెండు మూడు రోజులుగా కూకట్‌పల్లిలోని ఒక కాలనీలో రెక్కీ చేశాడు. ఒక ఇంట్లో చోరీకి ప్రయత్నిస్తూ ఉండగా స్థానికులు పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడి వద్ద పల్సర్ బైక్, సెల్ ఫోన్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.