23-08-2025 12:33:10 AM
చివ్వెంల,(విజయక్రాంతి): బైక్ పై వెళ్తున్న ముగురిని చంపేందుకు కారులో వెంబడించిన ఐదుగురు వ్యక్తులు.సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్ నుండి బైక్ పై వెళ్తున్న ముగ్గురిని (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) కారులో వెంబడించగా బీబీ గూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ ముందు బైక్ బయటపడవేసి భయంతో వైన్స్ షాప్ లోపలికి వెళ్లిన ఆ ముగ్గురు. బైక్ ను చూసి కారు నుండి దిగి ఆముగ్గురిని చంపడానికి కత్తులు, కర్రలతో వైన్స్ వైపు పరుగెత్తున దుండగులు. వైన్స్ షాప్ లో ఉన్న వారు అకస్మాత్తుగా బయటికి రావడంతో వారిని చూసి కారెక్కి పారిపోయిన దుండగులు. లోపలికి వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు. సీసీ కెమెరాలో హత్యాయత్నం దృశ్యాలు రికార్డయ్యాయి.