calender_icon.png 23 August, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువు శిఖంలో రియల్ దందా

23-08-2025 12:35:26 AM

- గజానికి రూ. 25 వేల చొప్పున విక్రయం 

- నలుగురు రాజకీయ నాయకుల నిర్వాకం 

- చోద్యం చూస్తున్న అధికారులు 

మేడ్చల్, ఆగస్టు 22(విజయ క్రాంతి)/మేడ్చల్ అర్బన్: ఒకవైపు ప్రభుత్వం చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు అక్రమార్కులు చె రువులను చెరబడుతున్నారు. మేడ్చల్ పట్ట ణ నడిబొడ్డున ఉన్న ఎర్ర చెరువులో శిఖం భూమిలో రియల్ దందా జోరుగా సాగుతోంది. అక్రమార్కులు రూ. 25 వేలకు గజం భూమి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నా రు. ఎర్ర చెరువు శిఖం భూమిలో సర్వేనెంబర్ 1117 లో 50 ఏళ్ల క్రితం గ్రామపంచా యతీ హయాంలో పట్టాదారులు ప్లాట్లు చేశారు.

అప్పట్లో రోడ్లు, మురుగు కాలువలు నిర్మించలేదు. కేవలం హద్దులు మాత్రమే ఏర్పాటు చేసి విక్రయాలు చేశారు. పట్టాదారులు నీరు నిలువని ప్లాట్లను మాత్రమే విక్ర యించారు. చెరువులో నీరు నిలిచే ప్లాట్లు విక్రయించలేదు. ఈ ప్లాట్ల మీద నలుగురు రాజకీయ నాయకుల కన్ను పడింది. ఐదేళ్ల క్రితం సుమారు 70 ప్లాట్లను కేవలం రూ. 25 లక్షల కు మాత్రమే కొనుగోలు చేశారు. వెంటనే ఈ ప్లాట్ ల లో మొరం వేసి ఎత్తు చేశారు.

అంతేగాక చెరువులోని నీటిని కింద కు వదిలేశారు. చెరువులోని నీరు వదిలేయడంతో స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వీరిపై కేసు నమోదు అయింది. అప్పట్లో వీరు అధికార పార్టీలో ఉండడమే గాక అప్పటి మంత్రి చామకూర మల్లారెడ్డి కి దగ్గరగా ఉన్నారు. వ్యవస్థలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. దీంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 

మోసపూరితంగా విక్రయాలు 

శిఖం భూమిలోని ప్లాట్లను అమాయకులను మోసం చేస్తూ విక్రయాలు సాగిస్తున్నా రు. ఎఫ్ టి ఎల్ పరిధిలోని ప్లాట్లను ఎల్ ఆర్ ఎస్ కింద రెగ్యులరైజ్ చేసుకోవడానికి డబ్బు చెల్లించారు. దరఖాస్తు రిజెక్ట్ కావడంతో డబ్బులు వాపస్ వచ్చాయి. కానీ రియల్ వ్యాపారులు దీనిని దాచిపెట్టి మొదట చె ల్లించిన డబ్బులు రసీదు చూయిస్తూ రెగ్యులరైజ్ అయిందని ప్రజలను మోసం చేస్తు న్నారు. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర య్యే అవకాశం ఉంది.

అమాయక ప్రజలు తెలియక తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేస్తున్నారు. అధికారులు వీరికి పూర్తి గా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ అధికారు లు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయొద్దని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్థానికులు ఫిర్యాదు చేశారు. ఎలాం టి స్థలమైనా తమకు ఆదాయం వస్తే చాలని రిజిస్ట్రేషన్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. 

ఆ వెంచర్ మొత్తం శిఖంలోనే ఉంది 

వెంచర్‌కు గ్రామపంచాయతీ హ యంలో అనుమతి ఇచ్చారు. దానితో మాకు సంబంధం లేదు. వెంచర్ మొ త్తం శిఖం లోనే ఉంది. మున్సిపల్, రెవె న్యూ అధికారులకు రిపోర్టు చేస్తాను. 

 - నికిత, ఇరిగేషన్ ఏఈ 

శిఖం భూమిని కాపాడాలి 

మేడ్చల్ పట్టణంలో ఉన్న ఎర్ర చెరు వు శిఖం కాపాడడానికి చర్యలు తీ సుకోవాలి. శిఖం భూమిని అక్రమం గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయొద్దని వినతి పత్రం ఇచ్చిన పట్టించుకోవడం లే దు. ఇరిగేషన్, మున్సిప ల్, రిజిస్ట్రేషన్ అధికారులపై క్రిమినల్ కేసులు నమో దు చేయాలి.

చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, మేడ్చల్