18-09-2025 12:27:25 AM
హనుమకొండ,(విజయక్రాంతి): దసరా ఉత్సవాలు త్వరలో ప్రారంభం కానున్నందున హనుమకొండ కిషన్ పురలో ఏ అండ్ ఏ సారీ ఫ్యాషన్ షో రూమ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేనాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఏ అండ్ ఏ షోరూం యజమాని విష్ణు మాట్లాడుతూ... సారీ వ్యాపారంలో 10 సంవత్సరాల అనుభవంతో చిన్న షాప్ నుండి షోరూం పెట్టే వరకు కస్టమర్ల నమ్మకానికి తగ్గట్టుగా, అన్ని రకాల ధరలలో పట్టు, ఫ్యాన్సీ ఐటమ్, కంచు పట్టు చీరలు, తమ వద్ద లభిస్తాయి పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా మహిళలకు మంచి డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుందని, ఇంత ముందు లాగానే కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, సిబ్బంది పాల్గొన్నారు.