calender_icon.png 18 September, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా లేబర్ కార్డుల పంపిణీ

18-09-2025 12:27:41 AM

ఘట్ కేసర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి) : దేశ ప్రధాని నరేంద్ర మోడీ  జన్మదినo సందర్భంగా వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన మరియు ఇతర కార్మికులకు లేబర్ కార్డులను ఉచితంగా అందించే విధంగా బైపాస్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు ఈకార్డు తీసుకోవడం వల్ల వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

కార్మికులకు ఇన్సూరెన్స్ ద్వారా సహజ మరణానికి రూ.1లక్ష 30 వేలు, యాక్సిడెంట్లో చనిపోయిన వారికి రూ. 6లక్షలు, కార్మికుని కూతురు వివాహానికి రూ. 30 వేలు, ఇద్దరు కూతుర్ల వరకు వర్తిస్తుందన్నారు. కూలి చేసుకునే కార్మికుని భార్య ప్రసవిస్తే ఇద్దరు పిల్లల వరకు రూ. 30 వేలు  వర్తిస్తుందన్నారు.

లేబర్ కార్డును ప్రతి ఒక్క కార్మికుడు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ అద్యక్షడు  కుమ్మిడి మహిపాల్ రెడ్డి,  బిజెపి జిల్లా, ఉమ్మడి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.