calender_icon.png 19 November, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు రోజలు భారీ వర్షాలు

16-08-2024 12:46:29 AM

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూ ర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చర్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ జిల్లాల్లో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమిటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.