calender_icon.png 19 November, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్లబావి కమాన్‌కు మరమ్మతులు చేపట్టాలి

16-08-2024 12:46:49 AM

జీహెచ్‌ఎంసీ అడిషినల్ కమిషనర్ శ్రీవత్స కోట 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15(విజయక్రాంతి): నగరంలో చారిత్రాత్మక మెట్లబావి కమాన్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ అడిషినల్ కమిషనర్ శ్రీవత్స కోట ఆదేశించారు. బన్సీలాల్ పేట మెట్ల బావిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కమిషనర్, నిర్వహణ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కమాన్ ముందు భాగం ఓ ట్రక్కు కారణంగా దెబ్బతిన్నట్టుగా అధికారులు తెలియజేయడంతో వారం రోజుల్లో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. మెట్లబావి ఫౌంటెయిన్ వద్ద గార్డెన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మెట్లబావి ప్రాంతం నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షణ చేయాలని బేగంపేట డిప్యూటీ కమిషనర్‌కు సూచించారు.