calender_icon.png 19 October, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోర్టల్ లో ఆధార్ నెంబర్ అప్ గ్రేడ్ చేసుకోవాలి

18-10-2025 08:22:50 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఖజానా శాఖ నుండి వేతనాలు తీసుకుంటున్న ప్రతి ఒక్క ఉద్యోగి IFMIS పోర్టల్ లోని హెచ్ఆర్ మాడ్యూల్ లో ప్రతి ఒక్క ఉద్యోగి తన ఆధార్ కార్డు నెంబర్ ను అదేవిధంగా మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకోవాలని జిల్లా ఖజానా అధికారి సరోజ తెలిపారు. ఈ వివరాలను పూర్తి చేసుకున్న తర్వాతనే అక్టోబర్ నెలకి సంబంధించిన వేతనాల బిల్లును ప్రాసెస్ చేసుకోవాలి.

ఒకవేళ పై వివరాలను నమోదు చేసుకోకపోతే డిడివోలకు అక్టోబర్ నెలకు సంబంధించిన వేతనాల బిల్లులు IFMIS పోర్టల్ లో ఓపెన్ కాదు. కాబట్టి జిల్లాలో  పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి వివరాలను డీడీవోలు  కచ్చితంగా నమోదు చేసుకోవాలి. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను అప్డేట్ చేసుకోకపోతే వారికి అక్టోబర్ నెలకి సంబంధించిన వేతనాలు మంజూరు  కావు . అదేవిధంగా పై వివరాలను అప్డేట్ చేసుకున్న తర్వాత వాటి పూర్తి వివరాలను వేతనాల బిల్లుకు డిడిఓ లు ధ్రువీకరిస్తూ బిల్లుతో పాటు జతపరచాలని జిల్లా ఖజానా శాఖ అధికారి సరోజ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు .