18-10-2025 08:18:57 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని జుక్కల్ చౌరస్తా వద్ద తెలంగాణ జాగృతి నాయకులు బిసి రిజర్వేషన్ కొరకు నిరసన కార్యక్రమం తెలియజేసి దుకాణాలను బందు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. అధిక జన సంఖ్య ఉన్న బీసీలకు రిజర్వేషన్ కల్పించడంపై ప్రభుత్వాలు మొండి వైగిరి మానుకోవాలన్నారు. రిజర్వేషన్ కల్పించకుంటే జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తం రాస్తారోకోలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.