10-12-2024 12:17:21 AM
మస్కట్: మహిళల జూనియర్ ఆసియా కప్‌లో భారత హాకీ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం మలేషియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 5-0తో విజయాన్ని అందుకుంది. దీపికా (37, 39, 48వ నిమి షంలో) హ్యాట్రిక్ గోల్స్‌తో మెరవగా.. వైష్ణవి (32వ ని.లో), కనికా (38వ ని.లో) గోల్స్ చేశారు. ఆదివారం బంగ్లాతో జరిగిన తొలి పోరులో భార త్ 13 గోల్స్ కొట్టిన సంగతి తెలిసిందే.