calender_icon.png 19 August, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి శ్రద్ధలతో అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠాపన

18-08-2025 11:55:46 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మండలంలోని చిర్రకుంట గ్రామంలో సోమవారం వేదపండితులు మనోహర శర్మ ఆధ్వర్యలో గత రెండు రోజులుగా ప్రత్యేక పూజలు చేసి అభయాంజనేయ స్వామి,ధ్వజ స్తంభం ల ప్రతిష్ఠాపన చేశారు. ఈ పూజలో భాజపా సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు, ప్రముఖ వ్యాపారవేత్త నక్క ఉమేష్ యాదవ్, సావిత్రి, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్ దంపతులు,అరిగెల వేణు దమతులు, శరత్ లు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి,స్వామివారి ఆశీసులు పొందారు,అనంతరం భక్తులు భక్తి గీతాలతో భజన కార్యక్రమం చేపట్టారు