19-08-2025 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
బాన్సువాడ ఆగస్టు 18 : తెలంగాణ రాష్ర్టంలో బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచాలన్న సీఎం రేవంత్ రెడ్డి కి రిజర్వేషన్ విషయంలో చిత్తశుద్ధి లేదని బిఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి మాట్లాడుతూ, పరిపాలన చేతగాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , బీసీ రిజర్వేషన్ విషయంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అఖిలపక్షాన్ని ఢిల్లీ కి తీసుకెళ్లి ప్రధానమంత్రి తో మాట్లాడుదామని చెప్పి అఖిలపక్షాన్ని తీసుకెళ్లకుండా ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ వాళ్లతో తో ధర్నా చేస్తే సొంత పార్టీ వాలే రాలేరు.
అని ఏద్దేవా చేసారు. రిజర్వేషన్ విషయం లో ఫెయిల్ అయి ఇప్పుడు కెసిఆర్ మీద పడుతున్నారని గతం లో కెసిఆర్ ఏది అయితే బీసీ రిజర్వేషన్ పెట్టారో దానివలనే ఇప్పుడు రిజర్వేషన్ రాకుండా ఆగి పోతుంది అని చెప్తున్నాడనీ ఆయన పేర్కొన్నారు.గతంలో తమిళనాడు రిజర్వేషన్ విషయంలో అప్పటి సీఎం జయలలిత పీవీ నరసింహారావు హయాంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఆర్టికల్ నైన్ లో పెట్టి 50% రిజర్వేషన్ సాధించింది.
ఆ పని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తలేవు ఆ ఆలోచన సీఎంకు లేదా అని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ ధర్నా కు మద్దతు గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు కార్గే రాహుల్ గాంధీ రాలేరన్నారు. ఏ ఒక్క పథకం కూడా 100% మామూలుగాకుండా 20% మాత్రమే అమలు చేస్తూ అన్ని చేసినా అని గొప్పలు చెప్పుకుంటున్నాడు దీనివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, సాయిబాబా. మొచ్చి గణేష్. బోడ రాంచంధర్. రమేష్ యాదవ్ గాండ్ల కృష్ణ. నర్సింలు మన్నే అనీల్. లక్ష్మణ్,సాయిలు, సంజయ్ యాదవ్ శివ సూరి. తదితరులు పాల్గొన్నారు.
బొర్లం బసవేశ్వర ఆలయంలో బాజిరెడ్డి ప్రత్యేక పూజలు
బాన్సువాడ, ఆగస్టు 18 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం లోని బోర్లం గ్రామం లో గల శ్రీ అది బసవేశ్వరా ఆలయంలో చివరి శ్రావణమాస సోమవారం సందర్బంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక పూజకార్యక్రమాలు చేపట్టారు. ఆది బసవేశ్వర ఆలయ పీఠాధిపతి సోమయప్ప బాజిరెడ్డి గోవర్ధన్ ను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, ఎర్రవట్టి సాయిబాబా. మొచ్చి గణేష్. బోడ రాంచంధర్. రమేష్ యాదవ్ గాండ్ల కృష్ణ. నర్సింలు మన్నే అనీల్. లక్ష్మణ్.. సాయిలు.. సంజయ్ యాదవ్ శివ సూరి పాల్గొన్నారు...