calender_icon.png 19 August, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వరదకు రైతులు బాధ పడవద్దు

19-08-2025 12:00:00 AM

భరోసాతో ఉండండి.. నేనున్నానన్న ఎమ్మెల్యే మదన్మోహన్ 

ఎల్లారెడ్డి, ఆగస్టు 18  : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న వరదకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాలకు చెందిన గ్రామాలు చినూర్, వాడి గోలింగాల లింగంపల్లి తాండూర్, వెంకంపల్లి, మాటూరు మాసంపల్లి, జలాల్పూర్ ఎర్రవరం మతమాల మల్కాపురం, రుద్రారం గ్రామాలకు చెందిన మాంజీర ది పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాల రైతులు ఎగువ నుండి వస్తున్న, సింగూర్ ప్రాజెక్ట్, నుండి భారీ వరద సుమారు 65000 క్యూసెక్కులు, అలాగే మంజీరా నదిలో కలిసే పసు పేరు, 20,000 క్యూసెక్కులు మంజీరా నది, 20వేల క్యూసెక్కులు మరియు పోచారం ప్రాజెక్టు నుండి 7500 క్యూసెక్కులు, ఇతర ప్రాంతాల నుండి ఓ పదివేల క్యూసెక్కులు, మంజీరా నది నిండా పొంగిపొర్లతో ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాల్లో పలు గ్రామాలకు చెందిన సుమారు 3000 ఎకరాల పంట పొలాలను నష్టం చేస్తున్న మాజీ ర నది భారీ వరదకు రైతులు తీవ్రం నష్టం వాటిల్లుతున్నారు.

విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ దిగువన ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిపారుదల శాఖ అధికారులతో జుక్కల్ ఎమ్మెల్యేతో నీటీ పారుదల శాఖ మంత్రితో, చర్చించి 15 గేట్ల ద్వారా లక్ష 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయించారు. సుమారు రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో గేట్లను ఆపకూడదని దిగువకు నీటిని విడుదల చేస్తూ ఎగువనున్న రైతులకు పంట పొలాలకు నష్టం వాటిల్లకుండా నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులను కాపాడాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశించారు. ప్రాజెక్టు నీటిమట్టం 17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీలకు నీరు చేరిందని వర్షాలు భారీగా ఉండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులు నీటిని నిల్వ ఉస్తే ఎగువనం ఉన్న రైతులు నష్టపోతారని ప్రత్యేకంగా వారికి సంబంధిత శాఖ అధికారులతో మరియు నీటిపారుదల శాఖ నిజాంసాగర్ అధికారులకు హెచ్చరించారు.

అర్ధరాత్రి నిజాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్, ఆగస్టు 18 ః నిజాంసాగర్ ప్రాజెక్టు ను ఆదివారం అర్ధరాత్రి జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పరిశీలించారు. ప్రాజెక్టు లోకి అకస్మాత్తుగా వరద నీటి ప్రవాహం ఎక్కువైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన  ప్రాజెక్టు వద్దకు చేరుకొని  ప్రాజెక్టు వివరాలను ఈ ఈ సోలోమాన్ ను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం వరకు 49 వేల క్యూసెక్కుల వరద నీటి  ప్రవాహం ఉండగా రాత్రి ఏకంగా 90 వేల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహానికి చేరుకోవడంతో ప్రాజెక్ట్ భద్రత పై అధికారులకు తగు సూచనలు చేస్తూ  వరద గేట్ల ద్వారా నీటిని మంజీరలోకి విడుదల చేశారు.