31-01-2026 01:23:21 AM
హైదరాబాద్, జనవరి 30(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆ ర్పీ) రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న సూచన మేరకు తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన (టీఆర్‌వీఎస్) రాష్ట్ర ఇన్‌చార్జి ఎంఎల్ రాజు గౌడ్ జేఎన్టీయూ యూనివర్సిటీ (హైదరాబాద్) టీఆర్‌వీఎస్ అధ్యక్షు డిగా ఎం.అభిలాష్‌ను నియమించారు. వి ద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాడటంలో, విద్యా హక్కుల పరిరక్షణలో అభిలాష్ క్రియాశీలక పాత్ర పోషిస్తారని అన్నారు.
టీఆర్పీ ఆశయాలను, టీఆర్‌వీఎస్ లక్ష్యాలను విద్యార్థుల మధ్యకు తీసుకెళ్లడంలో, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడటంలో ఆయన నాయకత్వం కీలకంగా నిలుస్తుం దన్నారు. నియామకానికి సహకరించిన టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న, టీఆర్‌వీఎస్ ఇన్‌చార్జి ఎంఎల్ రాజు గౌడ్‌కి, విద్యార్థి విభాగం నేతలకు అభిలాష్ కృతజ్ఞతలు తెలిపారు.