calender_icon.png 9 November, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఖండ తాండవం

09-11-2025 12:00:00 AM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కొలాబరేషన్‌లో వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తుండగా, ఆది పినిశెటి ఓ శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ చిత్రం.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ‘తాండవం’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను సంగీత దర్శకుడు తమన్ పవర్ ఫుల్ బీట్స్, డివోషనలో చాంట్స్‌తో కంపోజ్ చేశారు. ఈ ప్రోమోలో.. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకం తో తాండవం చేస్తూ కథానాయకుడు బాలకృష్ణ ఆకట్టుకున్నారు. ‘అఖండ తాండవం..

హరహర మహాదేవ.. ఓం నమఃశివాయ..’ అంటూ సాగుతోందీ పాట. ఇందు కు సంబంధించి పూర్తి గీతం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి డీవోపీ: సీ రాంప్రసాద్, సంతోష్; సంగీతం: తమన్; ఫైట్స్: రామ్ లక్ష్మణ్; ఎడిటర్: తమ్మిరాజు; ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్; సమర్పణ: ఎం తేజస్విని నందమూరి; నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట; రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను.