08-11-2025 12:51:27 AM
మళయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రం ‘కాంతా’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సముద్రఖని, రానా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో దుల్కర్ మాట్లాడుతూ.. ‘ఇది మంచి డ్రామా, థ్రిల్లర్. కచ్చితంగా థియేటర్లలో చూడండి. గొప్ప అనుభూతి పొందుతారు” అన్నారు.
రానా మాట్లాడుతూ.. ‘కాలాన్ని సినిమా మాత్రమే రీ క్రియేట్ చేయగలదు. ఫిలిం స్టూడియో బ్యాక్‌డ్రాప్‌లో చెప్తున్న కథ ఇది. నవంబర్ 14 తర్వాత దుల్కర్‌ను అందరూ నటచక్రవర్తి అని పిలుస్తారు” అన్నారు. ‘ఇది చాలా గర్వంగా ఫీల్ అయ్యే సినిమా’ అని సముద్రఖని చెప్పారు. ఇదే వేదికపై రానాపై భాగ్యశ్రీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. “కాంత’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది.
ఇలాంటి సినిమాలో అవకాశం రావడం అదృష్టం. నిజానికి, నేను రానాకు నచ్చలేదు. ‘చూడటానికి ఓకే కానీ, యాక్టింగ్ పరంగా ఏమో!’ అని ఆయన అన్నారు. కానీ, దర్శకుడికి మాత్రం నాపై నమ్మకం ఉంది. లుక్ టెస్ట్, ఆడిషన్స్, డైలాగ్స్ చెప్పిన తర్వాతే సినిమాలో ఓకే చేశారు” అని చెప్పుకొచ్చింది.
ఈ వ్యాఖ్యలపై రానా స్పందిస్తూ.. ‘ప్రతీసారి నేను ఎందుకు విలన్ అవుతాను’ (నవ్వుతూ) అన్నారు. మొత్తానికి భాగ్యశ్రీ సరదాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు సెల్వమణి, నిర్మాత ప్రశాంత్ పొట్లూరి, చిత్రబృందం పాల్గొన్నారు.