calender_icon.png 9 July, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలు నాటి బాధ్యతగా పెంచాలి

09-07-2025 07:43:43 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రతి విద్యార్థి మొక్కలు నాటి దాన్ని బాధ్యతగా పెంచి పర్యావరణంలో భాగస్వాములు కావాలని జిల్లా క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి(Officer Srikanth Reddy) అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో విద్యార్థులు కలిసి మొక్కలు నాటి ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవీందర్ రెడ్డి, శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.