calender_icon.png 13 July, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లి లలిత వర్ధంతి

27-05-2025 12:00:00 AM

వలిగొండ,మే 26 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రజా ఫ్రంట్ వలిగొండ మండల అధ్యక్షుడు రాపోలు పవన్ కుమార్ ఆధ్వర్యంలో బెల్లి లలిత 26వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ బట్టు రామచంద్రయ్య పాల్గొని మాట్లాడుతూ ఆనాడు దగా పడ్డ తెలంగాణ కోసం ఎంతో ఉద్యమించిన బెల్లి లలిత అక్కను నర హంతకులు 17 ముక్కలుగా నరికి హత్య చేశారని అన్నారు.

ఆపరేషన్ కగార్ నిలిపివేసి కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చూస్తూ  కేంద్రం చత్తీస్గడ్ నారాయణపూర్ అడవిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులను కేంద్ర బలగాలు కాల్చి చంపడాన్ని తెలంగాణ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కాశపాక మహేష్ ,తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ర్ట కమిటీ సభ్యులు కావలి యాదయ్య,  ప్రధాన కార్యదర్శి రసాల నరసింహ, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దుబ్బ దానయ్య, బీసీ సంఘం నాయకులు సాయిని యాదగిరి, టి పి ఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు  బాలస్వామి, మల్లారెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.