03-01-2026 01:11:30 PM
జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఎస్ఐ విక్రమ్
నవాబ్ పేట్ : రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని నవాబ్ పేట్ ఎస్ఐ విక్రమ్ అన్నా రు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం చౌడపూర్ మండలం లోని చాకలపల్లి గ్రామంలో వాహనదారులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు భద్రతా వారో త్సవాలను ఏటా నిర్వహించి వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పి స్తున్నామన్నారు.
వాహనాలలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు తప్పకుండా ధరించాలని, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను తీసుకె ళ్లాలని చెప్పారు. కండీషన్‌లో ఉన్న వాహనాలనే డ్రైవింగ్ చేయాలన్నారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు మద్యం సేవించడం, సెల్‌ఫోన్ చూడడం, నిద్రలేమి వంటి కారణాలతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకూ డదని చెప్పారు. అనంతరం నిబంధనలు పాటి స్తూ వాహనాలు నడుపుతామని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు . ఈ కార్యక్రమంలో నవాబ్ పేట్ Si విక్రమ్, చాకలపల్లి సర్పంచ్ పటేల్ చెన్నయ్య, మాజీ సర్పంచ్ శేఖర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.